How to clear Debts fast
మధ్యతరగతి వారి జీవితాలను తలకిందులుగా మారుస్తున్నది అప్పు. మధ్యతరగతి వారి జీవితంలో సగం జీవితం అప్పుల ఊబి నుంచి ఎలా బయటకు రావాలని ప్రయత్నించడానికి గడిచిపోతుంది. ఎంతోమందికి నిద్రలేని రాత్రులు గడపడానికి కారణం అప్పులు.
అప్పులు ఎందుకు అవుతాయి?
అప్పుల అవడం ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క కారణం ఉన్నప్పటికీ సాధారణంగా ఆదాయానికి మించిన ఖర్చుల వల్ల అప్పులు అనేవి ఏర్పడడం జరుగుతుంది.
- అన్ ఎక్స్పెక్టెడ్ హెల్త్ ఇష్యూ స్
- అదుపు లేని ఖర్చులు
- ఖర్చులు పెరిగినంత వేగంగా ఆదాయం పెరగకపోవడం.
- ఒక్కరి ఆదాయంపై ఎక్కువ మంది ఆధారపడడం.
అప్పులు తీర్చే మార్గాలు
How to clear Debts quickly in India
అప్పులు తీర్చాలంటే మీరు ముందుగా మీ మానసిక ధైర్యాన్ని కోల్పోకుండా ఉండాలి ఎందుకంటే అప్పులనేవి ఒక్కరోజులో ఏర్పడినవి కావు అలాగే ఒక్కరోజులో కూడా అప్పులన్నీ తీరిపోవు. ఇదంతా నిరంతరంగా కొనసాగే ప్రక్రియ ఈ ప్రక్రియలో స్టెప్ బై స్టెప్ మీరు ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అంతేగాని ఒకేరోజులో అద్భుతాలు జరుగుతాయని ఆలోచించడం మొదలెడితే అవి మిమ్మల్ని ఇంకా ఎక్కువ ఇబ్బందులకు గురి చేసే అవకాశం కూడా ఉంటుంది.
- ముందు మీరు ఒక టెర్మి ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి.
- దానితోపాటు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుని ఉండాలి .
ఎందుకంటే మీరే మీ కుటుంబ యజమాని అయినట్టయితే ఏదైనా అనర్థం జరిగినప్పుడు మీ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండాలంటే కచ్చితంగా మీరు ఒక టెర్మిషన్స్ తీసుకోవాలి అలాగే అది మీకు ఎంతో ఆత్మ ధైర్యాన్ని కూడా కలిగిస్తుంది దానితోపాటు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకున్నట్టయితే మీకు భవిష్యత్తులో అనారోగ్య కారణాలవల్ల అప్పులు అనేవి పెరగకుండా ఉండేందుకు ఇది ఎంతో సహాయపడతాయి అలాగే మీలో మానసిక ప్రశాంతతను పెంపొందించేందుకు ఇవి ఎంతో గానో ఉపయోగపడతాయి.
1) సరైన ప్రణాళిక:
how to pay off Debt fast with low income?
ముందుగా అప్పులను తీర్చాలనుకున్నప్పుడు మీకున్న అప్పులు అన్నిటిని కాగితంపై రాయండి.
అందులో ఎక్కువ ఇంట్రెస్ట్ కడుతున్నవాటిని ముందు తీర్చడానికి ప్రయత్నించండి తరువాత తక్కువ ఇంట్రెస్ట్ కడుతున్న అప్పులు తీర్చే విధంగాప్రణాళిక తయారు చెయ్యండి.
ఇలా చేయడం వల్ల మీకు తొందరగా ఉపశమనేది లభిస్తుంది.
ఉదాహరణకు: మీకు పర్సనల్ లో మరియు క్రెడిట్ కార్డులపై అప్పులు ఉన్నట్టయితే ముందు క్రెడిట్ కార్డు పై గల అప్పులను ముందుగా తీర్చండి.
ఎందుకంటే మీ పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్ కంటే కూడా క్రెడిట్ కార్డు పై పడే ఇంట్రెస్ట్ లేట్ పేమెంట్ చార్జెస్ అనేవి మీ ఆదాయాన్ని చాలా ఎక్కువ మొత్తంలో ప్రభావం చూపుతాయి.
క్రెడిట్ కార్డు :18% to 36%
పర్సనల్ లోన్ :11 to 18%
కనుక మీరు ముందుగా క్రెడిట్ కార్డు అప్పులను తొలగించుకోవడం ఉత్తమ ఆలోచన.
2) మీ ఆదాయాన్ని తక్కువ చేయడం:
How to Debt Free in 6 months?
సాధారణంగా అప్పులు తీర్చాలంటే ఆదాయాన్ని పెంచాలనుకుంటారు కానీ ఆదాయాన్ని తగ్గించడం ద్వారా కూడా అప్పులు తీర్చవచ్చు అది ఎలా అంటే మీకు 50,000 రూపాయలు వస్తున్నాయంటే మీరు ఖర్చులు 30000 వరకు ఖర్చు చేస్తున్నారనుకుంటే మీ ఆదాయం 10000 పెరిగినా సరే మీరు మీ ఆదాయం 50kగానే గుర్తించి మీ ఖర్చులను అదుపులో ఉంచి మిగిలిన పదివేల రూపాయలు సేవింగ్స్ గా మార్చడం.
దీని ద్వారా మీకు అప్పులు ఉన్నా సరే కొద్దిగా జీవితంలో డబ్బులు సేవ్ చేస్తున్నామని ఆలోచన మీకు చాలా పెద్ద మొత్తంలో మీపై మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.
ఈ విధంగా కొన్ని రోజులు ప్రయత్నించినట్లయితే కచ్చితంగా అప్పుడు నుంచి బయటపడడం సాధ్యమవుతుంది.
3) ఆదాయాన్ని పెంచుకోవడం:How to clear Debts fast
ఆదాయాన్ని పెంచుకోవడం అనేది అంత సులభమైన పని ఏమీ కాదు కానీ జాగ్రత్తగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా కొద్ది కొద్దిగా మీ ఆదాయం పెంచుకోవడానికి వీలవుతుంది.
మీ ఇంట్లో మీరు ఒక్కరే పని చేసేవారైతే మీ భార్యకు గాని ఇంకా మీ ఇంట్లో ఎవరికైనా సరే ఏదైనా చిన్న వ్యాపారం ఇక్కడ వ్యాపారం అనగానే పెద్ద మొత్తంలో పెట్టుబడి వ్యాపారం కాదు చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టే వ్యాపారం ఉదాహరణకు కిరాణా స్టోర్, లాంటి వ్యాపారాన్ని ప్రారంభించి ఆ వ్యాపారం ద్వారా మీరు రోజువారి ఖర్చులైనా సరే సంపాదించినట్లు కలిగినట్లయితే మీకు ఎంతో కొంత ఉపశమనం అనేది కలుగుతుంది.
స్టాక్ మార్కెట్ ఫర్ బిగినర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
3)వృధా వస్తువులను అమ్మి వేయడం
మీ ఇంట్లో మీకు అవసరం లేని వస్తువులు ఏమైనా ఉంటే వాటిని అమ్మడం ద్వారా కొంత డబ్బు అనేది ఉదాహరణకు మీరు పాత సోఫాలను మరియు మీరు వాడకుండా ఉండి ఇచ్చిన స్కూటీలు గాని బైక్ గాని ఏదైనా వస్తువులు ఉంటే వాటిని అమ్మి వేయడం ద్వారా కొంత డబ్బు సమకూర్చుకోవడానికి వీలవుతుంది ఇది ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించడానికి కూడా అవసరం పడుతుంది.
4) మీ కుటుంబంతో చర్చ:
.How to clear Debts fast
- సాధారణంగా ఇంటి యజమాని కుటుంబ వారితో చర్చించకుండానే చాలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తద్వారా కొన్ని రకాల అప్పులను కుటుంబానికి తెలియకుండా దాచడానికి ప్రయత్నం చేస్తారు
- అప్పుల వల్ల మరికొన్ని అప్పులు చేయవలసి వస్తుంది. ఎందుకంటే వారి దృష్టిలో ఉండవు కనుక మీరు శ్రమించవలసి వస్తుంది దానితోపాటు ఆ అప్పులు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి.
- మీకున్న అప్పుల గురించి పూర్తి వివరాలను మీ కుటుంబంతో చర్చించండి తద్వారా మీ ఆర్థిక పరిస్థితి గురించి మీ కుటుంబంలోని వారందరికీ అవగతం అవుతుంది. తద్వారా అందరూ వారి వారి అనవసర ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది.
- వారు ఇచ్చే సలహాలు కూడా కొన్నిసార్లు అప్పులు తీర్చడానికి ఉపయోగపడతాయి ఎందుకంటే ఒత్తిడిలో ఉన్నవాడి కంటే ప్రశాంతంగా ఉన్నవారు ఆలోచించే విధానం వేరుగా ఉంటుంది.
5)Debt consolidation loan :
అంటే మీకున్న అన్ని రకాల అప్పులను ఒకే అప్పు కిందికి తీసుకురావడం ఉదాహరణకు మీకు పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ లోన్, వెహికల్ లోన్, హోమ్ లోన్, మరియు ఇతర వ్యక్తుల నుండి ఏదైనా లోన్ తీసుకుంటే ఆ hand లోన్ ఇలా అన్ని రకాల లోన్లకు వేరువేరుగా ఈ అమ్మాయిలు పెట్టడం ద్వారా మీ ఆదాయానికి మించి EMI ల్ అనేవి ఏర్పడడం జరుగుతుంది.
మీరు మీ సాలరీ అకౌంట్ ఉన్న బ్యాంక్ మేనేజర్ తో మీ ఆదాయ వ్యయాల పరిస్థితి గురించి చర్చించి మీ అన్నిటిని కలిపి ఒక లోన్ గా మార్చే ప్రయత్నం చేయండి అని అడగడం ద్వారా కూడా బాధల నుండి విముక్తి పొందవచ్చు.
కానీ దీనికోసం మీరు మంచి సిబిల్ స్కోర్ ను కలిగి ఉండవలసి వస్తుంది.
6)avoid unnecessary talks:
మీరు సాధ్యమైనంత వరకు మీ అప్పుడు ఫీచర్ అనుకున్నప్పుడు ఒక ప్రణాళిక ప్రకారము జీవితాన్ని గడపవలసి ఉంటుంది అనవసరంగా మీ ఆదాయ పరిస్థితుల గురించి ఇతరులతో ముఖ్యంగా బయట వారితో చర్చించడం వల్ల మీ మీ పరిస్థితులు ఇతరులకు తెలియజేయడం వల్ల నీకు చాలా ఎక్కువ మొత్తంలో నష్టం జరిగే అవకాశం కూడా ఉంటుంది ఎప్పుడైతే మీ దగ్గర డబ్బులు లేవు అనే విషయం ఇతరులకు తెలుస్తుందో అది మీపై ఎక్కువ మొత్తంలో ఒత్తిని కలగజేయడం ద్వారా మీరు అప్పులు ఉన్న వారందరూ ఒకేసారిగా మిమ్మల్ని వేధించే అవకాశం కూడా ఉంటుంది.
కాబట్టి సాధ్యమైనంత వరకు మీ ఆర్థిక పరిస్థితి గురించి ఎవరితోనో చర్చించకుండా ఉండండి.
అవసర మైన పార్టీలకు ఫంక్షన్లకు వెళ్లకుండా ఉండండి దీని ద్వారా మీలో అనవసర ఆలోచన నుండి మిమ్మల్ని విముక్తి చేస్తుంది.
మరికొన్ని అప్పులు తీర్చే మార్గాలు:
what is the fastest way to get out of Debts?
ప్రధాన అంశం | వివరాలు |
---|---|
అవసరమైన వస్తువుల కొనుగోలు | అవసరమైన వస్తువులను మాత్రమే కొనండి. అనవసర ఖర్చులను తగ్గించండి. |
సాధారణ జీవనం | విలాసాలకోసం అప్పులు చేయకుండా సాధారణ జీవితం గడపండి. |
సమయ వినియోగం | ఉపయోగం లేని యూట్యూబ్ షాట్స్, రీల్స్ చూడటం మానండి. |
ఉపయోగకరమైన కంటెంట్ | సోషల్ మీడియాలో బిజినెస్ ఆలోచనలు, ఆదాయం పెంచుకునే మార్గాలను తెలిపే కార్యక్రమాలను చూడండి. |
చిన్న పెట్టుబడులు | చిన్నచిన్న పెట్టుబడులను ప్రారంభించండి. ఇవి కొంతకాలం తర్వాత సంపద సృష్టించడానికి కారణం అవుతాయి. |
.
- NOTE: పెట్టుబడులకు సంబంధించిన విషయాలను పెట్టుబడులకు సంబంధించిన సలహాలను ఆర్థిక నిపుణులను సంప్రదించి మాత్రమే తీసుకోగలరు, ఈ ఆర్టికల్ ద్వారా అందించిన సమాచారం ఎడ్యుకేషనల్ పర్పస్ గా ఉపయోగించుకొని మీ ఆర్థిక విషయాలకు సంబంధించిన పెట్టుబడులు
Nifty prediction for Today
1 thought on “How to clear Debts fast?త్వరగ అప్పులు తీర్చడం ఎలా?”